ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 18: సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారాల ప్రదానాన్ని శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నారు. వాల్పోస్టర్ను విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ ఏడాది అవార్డును అరుణోదయ నాగన్నకు అందజేయనున్నారని చెప్పారు.