హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌గా సీనియర్ న్యాయవాది ఏ సుదర్శన్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టులోని ఏజీ కార్యాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఏజీగా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి అదనపు ఏజీలు తేరా రజనీకాంత్‌రెడ్డి, ఇమ్రాన్‌ఖాన్, ఇతర ప్రభుత్వ న్యాయవాదులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.