పాలకుర్తి, జూన్18: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్‌నగర్ కేశోరాం సిమెంటు కర్మాగారం కాంట్రాక్టు కార్మికుల గుర్తింపు సం ఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది. కాం గ్రెస్ కంచుకోటలో ఏడేండ్ల తర్వాత గులాబీ గుబాళించింది. బీఆర్ఎస్ నేత, కేశోరాం గుర్తిం పు సంఘం అధ్యక్షుడు కౌశికహరి, ప్యానల్ ప్రధానకార్యదర్శి అభ్యర్థి మాదాసు శ్రీనివాస్ ఘ న విజయం సాధించారు. కర్మాగారంలో కాం ట్రాక్టు కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలను యాజమాన్యం మంగళవారం నిర్వహించింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. మొత్తం 809 మంది ఓటర్లకుగాను 787 మంది ఓటు వేశారు. ఇందు లో బీఆర్ఎస్ నేత కౌశికహరి, ప్యానల్ అభ్యర్థి మాదాసు శ్రీనివాస్ గెలుపొందారు. శ్రీనివాస్‌కు 418 ఓట్లు రాగా, కాంగ్రెస్ నేత బయ్యపు మనోహార్‌రెడ్డి ప్యానల్ అభ్యర్థి నగునూరి రమేశ్‌కు 352 ఓట్లు వచ్చాయి. నగునూరి రమేశ్‌పై మా దాసు శ్రీనివాస్ 66 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్టు ఎన్నికల అధికారి బీ డానియల్ ప్రకటించారు. హోరాహోరీగా ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడంతో కేశోరాం కార్మికులు, నాయకులు సంబురాలు జరుపుకున్నారు.
ఈ విజయం కేసీఆర్‌కు అంకితం
కేశోరాం గుర్తింపు సంఘం ఎన్నికల్లో మా ప్యానల్ విజయం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అంకితం. ఎన్నికల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కార్మికులపై అనేక రకాలుగా ఒత్తిడి చేసినా కార్మికులు నిజాయితీగా ఓటుహక్కు వినియోగించుకుని బీఆర్ఎస్ ప్యానల్‌ను గెలిపించడం సంతోషంగా ఉంది. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా వెనక్కి తగ్గకుండా కార్మికులు మాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా, హక్కుల సాధన కోసం పోరాటం చేస్తాం.
-కౌశికహరి, కేశోరాం గుర్తింపు సంఘం అధ్యక్షుడు