హైదరాబాద్ : సూర్యాపేట (Suryapet)) జిల్లావ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షాలు (Heavy Rain) కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకండా కురుస్తున్న వర్షాలకు(Heavy rains) వాగులు, వంకలు పొంగి పొర్లు తున్నాయి. చెరువులు, కుంటలు అలుగు దుంకుతున్నాయి. పలు చోట్ల చెట్లు విరిగిపడి, కరెంట్ స్తంభాలు నేలకూడలంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా, భారీ వర్షాలకు సూర్యాపేట జిల్లా జాజిరెడ్డి గూడెం మండలం అర్వపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) జల దిగ్బంధమైంది.
పాఠశాల ఆవరణ మొత్తం నుడుం లోతు వరకు నీళ్లు నిలిచాయి. సుమారు 200 మంది విద్యార్థులు, ఉపాధ్యా యులు అడుగు బయటపెట్టలేని పరిస్థితి నెలకొనడంతో అధికారులతో ఆదేశాలతో తాత్కాలింగా విద్యార్థు లను అక్కడ నుంచి తరలించి శ్రీరామ ఫంక్షన్ హాల్లో సర్దుబాటు చేశారు. తల్లిదండ్రులకు సమాచారం అందించి కొందరిని ఇంటికి పంపించారు. కాగా, భారీ వర్షాల నేపపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిం చారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలన్నారు. వర్షాల కారణంగా రేపు అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవును ప్రకటించింది.