వాజేడు, డిసెంబర్ 2 : ములుగు జిల్లా వాజేడు పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా విధులు ని ర్వర్తిస్తున్న రుద్రరాపు హరీశ్(30) సోమవా రం ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలో ని మండపాక గోదావరి బ్రిడ్జి సమీపంలోని ఫెరియాడో రిసార్ట్స్‌లో గది నంబర్ 107లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు. ఎస్పీ శబరీష్ ఘటన ప్రదేశానికి చేరుకొని ఎస్సై ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించారు. పోలీసులతోపాటు రిసార్ట్ నిర్వాహకులను వి వరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగత కారణలతోనే ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డాడని, డిపార్ట్మెంట్కు సంబంధించిన ఎలాంటి ఒత్తి డి లేదని చెప్పారు. హరీశ్ సొంత గ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం వెంకటేశ్వరపల్లి. 2020 బ్యాచ్‌కు చెందిన హరీశ్ గతంలో వాజేడులో శిక్షణ ఎస్సైగా విధులు నిర్వర్తించారు. ఇదే మండలంలోని పేరూ రు ఎస్సైగా, ములుగు ఎస్పీ ఆఫీసులో పనిచేశా రు. 6 నెలల క్రితం ఎస్సై గా వాజేడుకు వచ్చారు.
యువతితో కలిసి వచ్చి గది అద్దెకు
ఆదివారం సాయంత్రం ఒక యువతితో కలిసి కారులో వచ్చిన ఎస్సై హరీశ్ ఫెరియాడో రిసార్ట్స్‌లో గది అద్దెకు తీసుకున్నట్టు నిర్వాహకులు తెలిపారు. రాత్రంతా గదిలోనే ఉన్నాడని, బయటకు వెళ్లి మళ్లీ ఉదయం వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ నెల 14న ఎస్సైకి వేరే అ మ్మాయితో నిశ్చితార్థం ఉన్నట్టు తెలుస్తున్నది. ఎస్సై మెడ చుట్టూ చున్నీ ఉండడంతో ఎస్సైది హత్యాలేక ఆత్మహత్యా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. యువతిని పోలీసులు అదు పులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఎస్సై మృతిపై బంధువుల అనుమానాలు వ్యక్తం చేశారు.