దేవరకొండ రూరల్, డిసెంబర్ 5 : నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని పెంచికల్ పహాడ్ ఆదర్శ పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజ నం చేసిన తర్వాత కడుపు నొప్పి, వాం తులు వచ్చాయని విద్యార్థులు చెప్పడంతో వారిని అంబులెన్స్‌లో దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఆదేశానుసారం దేవరకొండ సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయసేవ అధికార సంస్థ చైర్పర్సన్ కే అనిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పీ రవీందర్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి హరిబాబు పాఠశాలను సందర్శించి విద్యార్థులను పరామర్శించారు. పాఠశాల పరిసరాలను, వంట గదిని పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజ నం అందించాలని సూచించారు.
ఉపాధ్యాయులే వంట మనుషులై..
ఐనవోలు, డిసెంబర్ 5 : పాఠాలు బోధించే ఉపాధ్యాయులు భోజనం వండి, వడ్డించిన ఘటన హనుమకొం డ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం జరిగింది. మధ్యాహ్న భోజనం ఉంటే ని ర్వాహకులకు రూ. 40వేల వరకు బిల్లు లు పెండింగ్‌లో ఉండడంతో వారు గురువారం వంట చేయడానికి రాలే దు. దీంతో హెచ్ఎం రజిత, ఉపాధ్యాయులు వంట చేసి విద్యార్థులకు వడ్డించారు. పాఠశాల పరిశీలనకు వచ్చిన తహసీల్దార్ విక్రమ్‌కుమార్ వచ్చారు.