వరంగల్ : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్‌లోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు నీటి సమస్య తీర్చాలంటూ రోడ్డు ఎక్కి ధర్నాకు దిగారు. గత నెల రోజులుగా నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం లేవగానే కనీసం వాష్ రూమ్‌కి పోదామంటే కూడా నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు.
కనీసం బాత్రూంలో శుభ్రం చేయడానికి కూడా నీరు లేక మమ్ములను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. గురుకుల పాఠశాల యజమాన్యానికి చెబితే ఒక్కరు పది రూపాలయ చొప్పున చెల్లిస్తే మెటర్ రిపేర్ చేపిస్తాని ప్రధానోపాధ్యాయుడు చెప్తున్నాడని, సమస్యలు చెప్తే విద్యార్థులను ఉపాధ్యాయులు వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే నీటి వసతి కల్పించాలని డిమాండ్ చేశారు.