ఫీజు బకాయిలు ఇంకెప్పుడిస్తరు.. రీయింబర్స్మెంట్ స్కీమ్ ఎత్తివేతకు కుట్ర
‘పెండింగ్ ఉన్న రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంకెప్పుడిస్తరు?. బకాయిలు చెల్లించకుండా 14లక్షల మంది పేద విద్యార్థులతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నది’ అని విద్యార్థులు మండిపడ్డారు. ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్లు నిఖిల్‌పటేల్, నీల వెంకటేశ్ నేతృత్వంలో శుక్రవారం వందలాది మంది విద్యార్థులు హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకొనే ప్రయత్నం చేయగా ఉద్రిక్తత నెలకొన్నది.
- 14 లక్షల మంది విద్యార్థులతో చెలగాటం
- హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద విద్యార్థుల ధర్నా
- సంఘీభావం తెలిపిన ఎంపీ ఆర్ కృష్ణయ్య
ఖైరతాబాద్, జూలై 17 : ‘పెండింగ్ ఉన్న రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంకెప్పుడిస్తరు?. బకాయిలు చెల్లించకుండా 14లక్షల మంది పేద విద్యార్థులతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నది’ అని విద్యార్థులు మండిపడ్డారు. ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్లు నిఖిల్‌పటేల్, నీల వెంకటేశ్ నేతృత్వంలో శుక్రవారం వందలాది మంది విద్యార్థులు హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకొనే ప్రయత్నం చేయగా ఉద్రిక్తత నెలకొన్నది. ముట్టడికి సంఘీభావం గా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు బడ్జెట్ కేటాయించకుండా సీఎం రేవంత్‌రెడ్డి విద్యార్థుల జీవితాల తో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలని, ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై అఖిలపక్ష స మావేశం నిర్వహించి అన్ని రాజకీయ పార్టీలతోపాటు మేధావులు, బీసీ సంఘాల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పన్నులు, భూముల అమ్మకాలు, కేంద్ర నిధులు తదితర మార్గాల ద్వారా రూ.7లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని, బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి రూ.4 లక్షల కోట్ల రుణాలు తీసుకున్నదని, మొత్తం 11లక్షల కోట్లకు పైగా నిధులు సమకూరినా విద్యార్థుల కోసం కేవలం రూ.8 వేల కోట్లు కేటాయించకపోవడం విచారకరమని ధ్వజమెత్తారు. డిగ్రీ, జూనియర్ కళాశాలలకు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో 200 కళాశాలలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం స్పందించి జీవో-9ను రద్దు చేయాలని, బకాయిలు విడుదల చేయాలని, లేకపోతే తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం నాయకులు అనంతయ్య, రాజేందర్, కిరణకుమార్, మోహన్ వంశీ, బాలయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

