దుండిగల్, ఏప్రిల్ 8: దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన థింగ్ కు బెటర్ కో హోర్ట్ 7 పేరిట జరిగిన జాతీయ సదస్సులో పాల్గొని 10 జట్లలో ఒకటిగా ఎంఎల్ఆర్ఐటీ నిలిచింది. నాస్కామ్ ఫౌండేషన్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సహకారంతో కళాశాలకు చెందిన సాయి తరుణ్ పసుమర్తి, నిరంజన్ విక్రమ్‌సింగ్‌తో కూడిన జట్టు వేర్ ఇస్ మై బస్ ప్రాజెక్టును ప్రదర్శించి అవార్డును అందుకున్నది. దాంతోపాటు రూ.5 లక్షల సీడ్ ఫండ్‌ను ఇవ్వడంతో పాటు జాతీయస్థాయి సర్టిఫికెట్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా కళాశాల వ్యవస్థాపక కార్యదర్శి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో ఎంఎల్ఆర్ఐటీ కళాశాల ప్రత్యేక గుర్తింపును దక్కించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇది తమ బాధ్యతను మరింతగా పెంచిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కే శ్రీనివాసరావు, కోఆర్డినేటర్ బలరాం, నాస్కామ్ ఫౌండేషన్ ప్రతినిధి మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.