ఎల్లారెడ్డిపేట, మే 29 : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థి సెల్‌ఫోన్ మత్తులో మునిగిన విషయాన్ని గుర్తించిన అతడి మేనమామ ‘పై చదువులొద్దు.. సెల్‌ఫోనే ముద్దు’అంటూ హెచ్చరించడంతో కంగుతిన్న విద్యార్థి ఇకపై సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంటానని రాసిన లేఖ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ బాలుడు ఇటీవల పదో తరగతి పాసయ్యాడు. అస్తమానం సెల్ఫోన్లో సోషల్ మీడియా చూస్తూ రోజంతా గడపుతున్నాడు.
గమనించిన ఓ డిపార్ట్మెంట్కు చెందిన అతడి మామయ్య సెల్‌ఫోన్‌తోనే ఆడుకోవాలని.. ఇక చదువు అక్కర్లేదని తన అల్లుడిని హెచ్చరించాడు. దీంతో కంగుతిన్న బాలుడు తాను వాటికి దూరంగా ఉంటానని ప్రమాణం చేస్తూ మామయ్యకు లేఖ రాశాడు. ఈ లేఖ ప్రస్తుతం వైరల్‌గా మారింది. సెల్‌ఫోన్‌కు అడిక్ట్ అయిన పిల్లలను దారికి తెచ్చుకునే ఏ ప్రయత్నమైనా సంతోషమే అంటూ పలువురు ‘మామయ్య హెచ్చరిక.. అల్లుడి మార్పు ఇక’ అంటూ మెచ్చుకుంటున్నారు.