హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 21: జేఈఈ(మెయిన్స్)-2026లో ప్రవేశానికి వెలువడిన ఫలితాల్లో ఎస్సార్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు అద్భుతమైన విజయాలు సాధించి జాతీయస్థాయిలో ప్రభంజనం సృష్టించారని ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి తెలిపారు. మంగళవారం వివరాలు వెల్లడించారు. జేఈఈ మెయిన్స్ ప్రవేశపరీక్ష అన్ని క్యాటగిరీలు కలిపి జాతీయస్థాయిలో ఎస్సార్ విద్యాసంస్థలకు చెందిన పెండెం శ్రీచరణ్ 1వ ర్యాంకు, డీ త్రిశాల్ 42వ ర్యాంకు, ఎన్ మైత్రేయి 45వ ర్యాంకు, ఎల్ దివిజ జ్యోతిర్మయి 142వ ర్యాంకు, ఎం శ్రీధర్ 162వ ర్యాంకు, కే ప్రణయ్‌కుమార్ 178వ ర్యాంకు, జీ యువన్‌చంద్ర 179, డీ ఇజాక్ 188, బీ సందీప్ 203, ఎల్.సాయిదీపక్ 225 ర్యాంకు సాధించి ఎస్సార్ కీర్తి ప్రతిష్టలను జాతీయస్థాయిలో నిలబెట్టారు, మే 17న జరిగే జేఈఈ అడ్వాన్స్-2026కు ఇప్పటివరకు 3,560కిపైగా ప్రవేశానికి విద్యార్థులు అర్హత సాధించి రాష్ట్రంలో ఎస్సార్ విజయపథాన్ని ఎగురవేశారన్నారు. వీరితో పాటు ఓపెన్, అన్ని క్యాటగిరీలు కలిపి జాతీయస్థాయిలో వరుసగా 254, 263, 264, 276, 284, 290, 296, 343, 347, 381, 395, 409, 437, 459, 470, 480, 490, 498, 554, 607, 649, 694, 790, 845, 852, 866 ఎన్నో ర్యాంకులు సాధించినట్టు ఆయన తెలిపారు. విద్యార్థులు సాధించిన ఈ విజయాలకు సంతోషాన్ని తెలియజేస్తూ ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి భవిష్యత్‌లో మరిన్ని అత్యుత్తమమైన మార్కులు సాధించేలా తీర్చిదిద్దుతామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.