కరీంనగర్ కమాన్‌చౌరస్తా, ఏప్రిల్ 19: ఐఐటీ జేఈఈ మెయిన్స్-2025లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు ర్యాంకులు పంట పండించారని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏడాది ఐఐటీ నీట్ పోటీ పరీక్షల్లో అల్ఫోర్స్ విద్యార్థులు రాణిస్తున్నందుకు సంతోషంగా ఉన్నదని అన్నారు. కళాశాలకు చెందిన ఎన్ శరణ్య 49వ ర్యాంకుతో అత్యున్నత స్థానంలో నిలువగా, పీ శ్రీహర్ష 244వ ర్యాంకు, ఎన్ అనిరుద్సాయి 272, డీ విశాల్ 329, జే వామిక 350, టీ ప్రణతి 456, అంకిత్‌సాయి 574, బీ ఆదిత్య 630, టీ శివాత్మిక 646, వీ హృషీకేశ్ 703, మహ్మద్ అబ్దులాక్ 968, పవార్ తేజ్‌పాల్ 1056, అక్షిత 1148, డీ విశాల్ 1270, ధమష్ 1298, అనురుద్ 1343, శివాని 1378, అర్ సుమిత్‌కుమార్ 1637, డీ కార్తీక్‌రెడ్డి 1826, మహ్మద్ అబ్దుల్ జీవషన్ 1989, బీ విష్ణు 2000వ ర్యాంకులు సాధించి అల్ఫోర్స్ కీర్తిని మరింత ఇనుమడింపజేసినట్టు చెప్పారు.
1000లోపు 11ర్యాంకులు, 2000లోపు 21ర్యాంకులు, 5000లోపు 40 ర్యాంకులు సాధించగా, 459 మంది విద్యార్థులు ఐఐటీ అడ్వాన్స్‌కు అర్హత సాధించడం గొప్ప విషయమని తెలిపారు. ఐఐటీ అడ్వాన్స్‌డ్‌లో పరీక్ష రాసేందుకు ఎంపికైన విద్యార్థులకు అత్యుత్తమ అధ్యాపక బృందంతో శిక్షణ ఇవ్వనున్నట్టు వివరించారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల పట్టుదల, అహర్నిశ కృషితోనే ఇంతటి ఘన విజయం సాధించగలిగిందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక బృందానికి ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ సమావేశంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.