హైదరాబాద్, మే13 (నమస్తే తెలంగాణ): పాలిటెక్నిక్.. ఇంజినీరింగ్ డిప్లొమా. పదో తరగతి తర్వాత సర్కారు కొలువు దక్కించుకునే కోర్సు ఏదైనా ఉదంటే అది పాలిటెక్నిక్కే. ఈ కోర్సుకు ఎక్కడా లేని డిమాండ్ ఉంటుంది. పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరిన విద్యార్థుల్లో అత్యధికులు ఫెయిలవుతున్నారు. మొదటి సెమిస్టర్లో 70-65% ఫెయిలవుతున్నారు. రెండు, మూడు సెమిస్టర్లలోనూ మార్పు రావడంలేదు. పాలిటెక్నిక్ కోర్సుల్లో ఏటా 20-22 వేల మంది విద్యార్థులు చేరుతున్నారు. ఉత్తీర్ణతశాతం తక్కువగా ఉండటంతో విద్యార్థులు మధ్యలోనే డ్రాపౌట్ అవుతున్నారు. మొత్తం కోర్సు పూర్తిచేసేది.. పట్టా పుచ్చుకునే వారి సంఖ్య సగానికి సగం తగ్గుతున్నది. ఇందుకు నెలకో పరీక్షను నిర్వహించడమే కాకుండా, జవాబుపత్రాల మూల్యాంకనం కూడా సరిగ్గా చేయడంలేదన్న ఆరోపణలొస్తున్నాయి.
ఫెయిలయ్యే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో సగం మంది కూడా కోర్సు పూర్తిచేయడంలేదు. ఇందుకు కొన్ని గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. 2022లో 22,267 మంది పాలిటెక్నిక్‌లో చేరారు. వీరిలో మొదటి సెమిస్టర్ పాసయ్యింది 7,421 మందే. రెండో సెమిస్టర్‌కు వచ్చేసరికి విద్యార్థుల సంఖ్య 21,106కు పడిపోయింది అంటే 1,100 మంది తగ్గారు. 3వ సెమిస్టర్‌కు వచ్చేసరికి విద్యార్థుల సంఖ్య 21,077 కాగా, నాలుగో సెమిస్టర్లో 20,232కు పడిపోగా, ఐదో సెమిస్టర్లో మొత్తం విద్యార్థుల సంఖ్య 8 వేలకు పడిపోయింది. ఈ 8 వేల మందిలో పాసయింది 4వేల మందే. కొందరు లెక్చరర్లు కావాలనే ఫెయిల్ చేస్తున్నారని, మూల్యాంకనం సరిగ్గా చేయడంలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒక మిడ్ సెమ్ పరీక్షను రద్దుచేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
పరిస్థితి ఇలా..