ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): నాణ్యమైన ఆహారాన్ని పెట్టకుండా విద్యార్థుల ఆరోగ్యాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నదని ఓయూ విద్యార్థులు మండిపడ్డారు. ఉస్మానియా ‘లా’ కాలేజీ హా స్టల్లో కొంతకాలంగా కుళ్లిన ఆ హారాన్నే పెడుతున్నారని మంగళవారం రాత్రి విద్యార్థులు వంట పాత్రలతో రోడ్డుపై బైఠాయించా రు. కుళ్లిన ఆహారంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవ డం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. హాస్టళ్లలో నాణ్యమైన భోజనం అందించడంతో పాటు, నిర్లక్ష్యం చేస్తున్న అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.