హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాలకు స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్ నిర్వహించాలని తెలంగాణ విద్యాకమిషన్ సర్కారుకు సిఫారసు చేయనున్నది. వర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని సూచించనున్నది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో స్థితిగతులపై విద్యాకమిషన్ సమగ్ర అధ్యయనం చేసింది. ఇప్పటికే ప్రాథమిక నివేదికను కమిషన్ సిద్ధం చేసింది.
సమగ్ర నివేదికను నెల రోజుల్లో సర్కారుకు సమర్పించనున్నది. 50-60 విద్యార్థి సంఘాలున్నాయని, ఈ సంఘాలతో ఇబ్బందులొస్తున్నాయని, వీటిని నియంత్రించాలన్న అభిప్రాయానికి కమిషన్ వచ్చింది. ఏదైనా సమస్య తలెత్తితే గెలిచిన గుర్తింపు సంఘంతో వర్సిటీ చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుందని కమిషన్ వాదన. సంఘాలు అధికంగా ఉండటం, ఆందోళనలు చేపట్టడంతో వాతావరణం దెబ్బతింటుందన్న యోచనలో కమిషన్ వర్గాలున్నాయి. ఇక వర్సిటీల్లో తిష్టవేసిన నాన్బోర్డర్లను బయటికి పంపించాలని, 75% హాజరును పకడ్బందీగా అమలుచేయాలని సిఫారసు చేయనున్నది.
కమిషన్ సిఫారసుల్లో కొన్ని