హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ విద్యార్థి వ్యతిరేక బడ్జెట్ అని బీఆర్ఎస్వీ ఓయూ నేత శ్రీకాంత్ముదిరాజ్ విమర్శించారు. గత బడ్జెట్ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటించి పెద్దఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఈ సంవత్సరంలో ఒక్క ఉద్యోగం కూడా ఎందుకు ఇవ్వలేదు? అని నిలదీశారు.
విద్యార్థులపై సర్కార్ వైఖరిని ఆయన తప్పుబట్టారు. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థుల తడాఖా ఏంటో చూపిస్తామని శ్రీకాంత్ హెచ్చరించారు.