నిర్మల్ అర్బన్/చెన్నూర్, నవంబర్ 5: నిర్మల్ పట్టణంలోని మహాత్మాగాం ధీ జ్యోతిబా పూలే(ఎంజేపీ) పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న దిలావర్పూర్ మండలం లోలం గ్రా మానికి చెందిన షేక్ ఆయాన్ హుస్సేన్ (14) మంగళవారం మృతి చెందాడు. తెల్లవారుజామున తోటి విద్యార్థులతో గ్రౌండ్‌కు వెళ్లిన ఆయాన్ వణుకు వస్తున్నదని పీఈటీకి చెప్పాడు. రెస్ట్ రూం లోకి తీసుకెళ్లగా ఫిట్స్ రావడంతో స్థాని క ఏరియా దవాఖానకు తరలించారు. అప్పటికే ఆయాన్ హుస్సేన్ మరణించినట్టు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల ఎదుట ఆందోళ న చేపట్టారు. దీంతో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్ సంతోష్, వాచ్‌మన్ అరుణ్, కేర్ టేకర్ రమేశ్, స్టాఫ్ నర్సు సుజాతతోపాటు పీఈటీ పెంటన్నను సస్పెండ్ చేస్తున్నట్టు పాఠశాల ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రకటించారు. ఆర్సీవో గోపీచంద్‌పై చర్యలకు ప్రతిపాదనలు పంపిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థి మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సం తాపం తెలిపి.. రూ. 2లక్షల ఎక్స్‌గ్రేషి యా, కుటుంబంలో ఒకరికి ఔట్ సో ర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇ చ్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పట్ట ణ సీఐ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాలలో 9వ త రగతి చదువుతున్న ఆకాశ్, అరుణ్ మంగళవారం అస్వస్థతకు గురికావడం తో ప్రభుత్వ దవాఖానకు తరలించా రు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.