మెట్లపై నుంచి జారిపడి కన్నుమూత
జహీరాబాద్, డిసెంబర్ 22 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూచినెల్లి మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో మెట్ల రేలింగ్ నుంచి ప్రమాదశాత్తు జారిపడి ఓ విద్యార్థిని మృతి చెందింది. చిరాగ్పల్లి పోలీసులు, అధ్యాపకుల వివరాల ప్రకారం.. జహీరాబాద్లోని జమాల్ కాలనీకి చెందిన షాదిహా మెహరీన్(14) గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నది. శనివారం రాత్రి స్టడీ ఆవర్ తర్వాత రెండో అంతస్తుకు రేలింగ్ మెట్ల గుండా వెళ్తున్న క్రమంలో ప్రమాదశాత్తు కిందకు జారిపడింది. తలకు తీవ్రగాయాలు కావడంతో సిబ్బంది జహీరాబాద్ ఏరియా దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని గాంధీ దవాఖానలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందింది. చిరాగ్పల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాలను జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు సందర్శించారు.