కామారెడ్డి, మార్చి 24: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరంపల్లి శివారులోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో పదోతరగతి విద్యార్థి మంగళవారం పాము కాటుకు గురయ్యాడు.
గాంధారి మండలం జెమిని తండాకు చెందిన బానోత్ చరణ్ సరంపల్లి గురుకుల పాఠశాలలో టీ బ్రేక్ సమయంలో మైదానంలోకి రాగా, పాము కాటేసింది. గమనించిన సిబ్బంది విద్యార్థిని జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.