దేవాలయ, వక్ఫ్ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | దేవాలయ భూములు, వక్ఫ్ భూములను ఎవరైనా ఆక్రమిస్తే వదిలిపెట్టమని ఎక్సైజ్, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.

మహబూబ్నగర్ : దేవాలయ భూములు, వక్ఫ్ భూములను ఎవరైనా ఆక్రమిస్తే వదిలిపెట్టమని ఎక్సైజ్, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. జిల్లా వక్ఫ్ బోర్డు సభ్యుడిగా నియమించబడిన అన్వర్ పాషాను మంగళవారం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి అభినందించారు. నూతనంగా నియమించబడిన వక్ఫ్ బోర్డ్ సభ్యులు అన్వర్ పాషా స్థానిక కౌన్సిలర్ల సహకారంతో జిల్లాలోని వక్ఫ్ భూములను గుర్తించి వాటికి రక్షణ కల్పించాలన్నారు.
నెలకు ఒక రోజు ఈ విషయంపై సమావేశమై చర్చించాలని, 15 సూత్రాల మైనారిటీ కార్యక్రమంలో కూడా వక్ఫ్ భూములపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని భూములు ఉన్నాయో అవన్నీ ఒక రిజిస్టర్లో నమోదు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.వెంకట్రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామరావు , మున్సిపల్ చైర్మన్ కె.సి నర్సింహులు, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆలయాల్లో ఆన్లైన్ ఆర్జిత సేవలు
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
పారిశుధ్య, ఆశా వర్కర్ల కృషి మరువలేనిది
నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు : మంత్రి నిరంజన్ రెడ్డి
పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి
ప్రజల నమ్మకాన్ని పెంచేలా పాలన అందించాలి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

