హైదరాబాద్, జూలై 20 (నమస్తేతెలంగాణ): మణిపూర్ రాష్ట్రంలో చెలరేగిన హింసాకాండపై స్పందించడానికి దేశ ప్రధాని మోదీకి 8 వారాల సమయం పట్టిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఎద్దేవా చేశారు. చివరకు సుప్రీంకోర్టు స్పందించి హింసను నివారించడానికి ‘మీరు చర్యలు తీసు కుంటారా? మేము తీసుకోవాలా?’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిం చాల్సిన పరిస్థితికి దిగజారిందని గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు.
మణిపూర్ హింసాకాండను వెంటనే అదుపు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి వారిపై లైంగికదాడికి పాల్పడటం, ఓ ఇద్దరిని దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దోషులను కఠినంగా శిక్షించడంతోపాటు, రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తక్షణమే అక్కడి సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.