హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ఉద్యాన పంటలకు రాష్ట్ర ఆర్థి క వ్యవస్థను బలోపేతం చేసే సామర్థ్యం ఉ న్నదని రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవనశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఉద్యాన ఉత్పత్తులలో స్వయం సమృద్ధిని సాధించడానికి వర్సిటీ అధునాతన పరిశోధనలపై దృష్టిపెట్టాల ని సూచించారు. వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డితో కలిసి మంగళవారం ఉద్యాన వర్సిటీలో సెంట్రల్ డైనింగ్ హాల్‌ను ప్రారంభించారు. రైతుల పొలాలను సందర్శించడం, నైపుణ్యాల పెంపుదలపై విద్యార్థులు దృష్టి సారించాలని సూచించారు.