హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని సర్కారు బడులను బలోపేతం చేయాలని, టీచర్ పోస్టులను భర్తీచేయాలని ప్రభుత్వాన్ని బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ (బీసీటీఏ) కోరింది. ఈ మేరకు నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవికి వినతిపత్రం అందజేసింది. మల్లు రవిని బీసీటీఏ ప్రతినిధి బృందం ఆదివారం ఘనం గా సన్మానించిన అనంతరం ఆయన మాట్లాడారు.