HCU | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపానికి అడవి జంతువులు బలైపోతున్నాయి. వందలాది జింకలు, వేలాది నెమళ్లకు ఆవాసాలు లేకుండా పోయాయి. దీంతో జింకలు, నెమళ్లపై వీధి కుక్కలు దాడులకు పాల్పడుతున్నాయి.
కంచ గచ్చిబౌలిలో 100 ఎకరాల్లో చెట్లను నరికివేయడంతో.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ హాస్టల్ వైపు జింక వచ్చింది. జింకను చూసిన కుక్కలు మొరుగుతూ.. దానిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన జింకను హెచ్సీయూ విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది.. వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. జింకకు తీవ్ర రక్తస్రావం జరిగింది. దీంతో అది చనిపోయింది.
ఇక చాలా జింకలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఆ జింకలను జనాలు చేరదీసి.. వాటికి నీళ్లను అందిస్తున్నారు. మూడు రోజుల్లో 100 ఎకరాల్లో పచ్చని చెట్లను నరికివేయడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణానికి ముప్పు కలిగించే విధంగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు.
HCUలో జింకపై దాడి చేసిన కుక్కలు
చెట్లు నరికేయడంతో HCU సౌత్ క్యాంపస్ హాస్టల్ వైపు వచ్చిన జింక పై దాడి చేసిన కుక్కలు
జింకకు గాయాలు కావడంతో పశువుల ఆసుపత్రికి తరలిస్తున్న యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది pic.twitter.com/tdJh7ka0O8
— Telugu Scribe (@TeluguScribe) April 4, 2025