నాగర్కర్నూల్ : వీధి కుక్కలు(Stray dogs) ఇద్దరు చిన్నారులపై దాడి చేసి( Attack children) గాయపరిచిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. కొల్లాపూర్ పట్టణానికి (Kollapur) చెందిన నరేశ్ కుమారుడు ధనుష్ (4) శుక్రవారం ఉదయం తన తన ఇంటి గేటు ముందు ఆడుకుంటుండగా ఒక్క సారిగా వీధి కుక్కలు దాడి చేశాయి.
తీవ్ర గాయాలపాలైన బాలుడిని వెంటనే తల్లిదండ్రులు అప్రమత్తమై స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిలోఫర్ వైద్యశాలకు తరలించారు. అలాగే పట్టణంలోని శివకుమార్ కుమారుడు రోహిత్(4) కూడా ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి. బాలుడి తల్లిదండ్రులు వెంటనే పట్టణంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. చికిత్స అనంతరం సిబ్బంది ఇంటికి పంపించారు.