Kaloji Health University | హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): ‘కొత్త ప్రశ్నపత్రం తయారు చేయడం ఎందుకు.. పాత ప్రశ్నపత్రమే డేట్ మార్చేసి ఇచ్చేస్తే సరి’ అన్నట్టుగా తయారైంది కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వ్యవహారం. పీజీ రేడియాలజీ విద్యార్థులకు తాజాగా రేడియో డయాగ్నోసిస్ పరీక్ష నిర్వహించారు. 100 మా ర్కుల పేపర్కుగానూ 10 ప్రశ్నలు ఇచ్చారు. ఈ ప్రశ్నపత్రం చూసి అవాక్కయ్యామని వి ద్యార్థులు చెప్తున్నారు. ‘ఈ క్వశ్చన్ పేపర్ ఎ క్కడో చూసినట్టుందే..?’ అంటూ ఆరా తీశా రు.
2023 నవంబర్లో నిర్వహించిన రేడి యో డయాగ్నోసిస్ సప్లిమెంటరీ పరీక్ష ప్రశ్నపత్రాన్నే యథాతథంగా తేదీ మార్చి ఇచ్చిన ట్టు గుర్తించారు. ప్రశ్నపత్రం కోడ్ మారలేదని, ప్రశ్నల వరుస కూడా మారలేదని తేల్చారు. పెద్దగా కష్టపడకుండా తేదీ మార్చి.. అక్షరం పొల్లుపోకుండా పాత ప్రశ్నపత్రాన్నే ఇచ్చారం టూ కామెంట్లు చేస్తున్నారు. రెండేండ్ల కింద టి పేపర్లు చదువుకుంటే ఈజీగా పాస్ కావొచ్చంటూ జోకులు వేసుకుంటున్నారు.