న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలు మార్చి 9వ తేదీ వరకు వాయిదా పడ్డాయి. మొదటి విడత బడ్జెట్ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. మూడు వారాల విరామం తర్వాత రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 9న ప్రారంభం కానున్నాయి.
13వ రోజైన శుక్రవారం లోక్సభ ప్రారంభమైన 10 నిమిషాలకే సభ వాయిదా పడింది. తిరిగి సభ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కాగా, ఎప్స్టీన్తో సంబంధాలున్న కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పురి రాజీనామా చేయాలంటూ సభ్యులు నినాదాలు కొనసాగించారు. ఈ క్రమంలో సభలో గందరగోళం కొనసాగడంతో మార్చి 9కి వాయిదా వేశారు. రాజ్యసభనూ అదే తేదీకి వాయిదా వేశారు.