హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): కన్నెపల్లి పంప్‌హౌస్‌కు సంబంధించిన హెడ్‌రెగ్యులేటర్ వద్ద స్టాప్‌లాగ్ గేట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ ఇటీవల సంబంధిత ఏజెన్సీకి, పంప్‌హౌస్ నిర్వహణ అధికారులకు సిఫారసు చేసింది. గోదావరి నది నుంచి కన్నెపల్లి పంప్‌హౌస్ ఫోర్‌బేలోకి నీటిని మళ్లించేందుకు హెడ్‌రెగ్యులేటర్‌ను నిర్మించారు.
ప్రతి హెడ్‌రెగ్యులేటర్ వద్ద స్టాప్‌లాగ్ గేట్లను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. హెడ్‌రెగ్యులేటర్‌కు అమర్చిన గేట్లు ఏదైనా కారణం వల్ల పనిచేయకపోతే నీటిని నియంత్రించేందుకు స్టాప్‌లాగ్ గేట్లు ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలో కన్నెపల్లి పంప్‌హౌస్ హెడ్‌రెగ్యులేటర్ వద్ద స్టాప్‌లాగ్ గేట్లను అమర్చాలని ఇరిగేషన్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందుకు దాదాపు రూ.100 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు.