దేవరకద్ర, మే 13 : మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం జీన్గరాల శివారులోని పెద్దగుట్ట వద్ద రాతి చిత్రాలను గుర్తించినట్టు తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కావలి చంద్రకాంత్ మంగళవారం తెలిపారు. ఈ చిత్రాలు 11వ శతాబ్దానికి చెందినవిగా సభ్యులు బండి మురళీధర్‌రెడ్డి, శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు.