హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా మెడికల్ కాలేజీలో విద్యార్థిని మీద జరిగిన లైంగిక వేధింపుల ఘటనపై అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) సమర్పించిన రెండు వేర్వేరు రిపోర్టుల అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఫిర్యాదు ప్రతు లు, నివేదిక కాపీలను ఆరోపణలు ఎ దుర్కొంటున్నవారికి ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని అంతర్గత కమిటీ చైర్మ న్, సభ్యులు, డీఎంఈ, ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్లను కోర్టు ఆదేశించింది.
వారంతా కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది. లైంగిక వేధింపులకు గురైనట్టు ఫిర్యాదు చేసిన విద్యార్థినిని కూడా ప్రతివాదిగా చేర్చాలని ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ, పురుష విద్యార్థులు, నర్సు, శాఖాధిపతి అయిన మాజీ ప్రొఫెసర్లు హైకోర్టును ఆశ్రయించారు. తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు స్టే అమల్లో ఉంటుందని పేర్కొంటూ.. తదుపరి విచారణను ఈనెల 30వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.