జనగామ, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మాలలకు ప్రథమ శత్రువు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అని మాల మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెం ట్ తాటి కుమార్ ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్ప టి తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాలు మాల సామాజిక వర్గానికి నామినేట్ పదవుల్లో గుర్తింపు ఇవ్వలేదన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో మాలలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తున్నదన్నారు. తాజా నియామకాల్లో మన్నె క్రిశాంక్, వేద సాయిచంద్, గజ్జల నగేశ్లను కార్పొరేషన్ చైర్మన్లుగా ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తంచేశారు.