హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రస్తుత ఓటర్ల సంఖ్య 3,34,26,323 ఉన్నట్టు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈవో) సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు సీఈవో కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కొత్త ఓటర్ జాబితా విడుదల చేశారు. రివైజ్డ్ ఓటర్ జాబితాలను అక్టోబర్ 29న విడుదల చేసినట్టు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి అక్టోబర్ 20 వరకు ఓటరు నమోదు నిర్వహించినట్టు తెలిపారు. మొత్తం ఓటర్లలో 1,66,16,446 మంది పురుషులు, 1,68,07,100 మంది మహిళా ఓటర్లు ఉన్నట్టు వెల్లడించారు. అయితే పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 1,90,654 మంది అధికంగా ఉన్నట్టు తెలిపారు. థర్డ్ జెండర్లు 2,777 మంది ఓటర్లుగా నమోదైనట్టు చెప్పారు. మొత్తం ఓటర్లలో కొత్త ఓటర్లు(18 నుంచి 19 ఏండ్లవారు)4,73,838 మంది, వృద్ధులు(85 ఏండ్లు పైబడినవారు)2,25,462 మంది, వికలాంగులు 5,28,085 మంది, ఓవర్సీస్ 3,578 మంది నమోదైనట్టు వివరించారు. ఓటర్ల సవరింపు ప్రక్రియలోభాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 8,02,805 మంది ఓటర్లను తొలగించామని, కొత్తగా 4,14,165 మంది నమోదయ్యారని, 5,93,956 మంది మార్పులు, చేర్పులు చేసుకున్నట్టు సీఈవో తెలిపారు.
ముఖ్యంశాలు ఇలా..