శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 03, 2020 , 02:00:05

దేశానికే రోల్‌మోడల్‌ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌

దేశానికే రోల్‌మోడల్‌ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌

నీలగిరి: ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను దళిత, గిరిజనుల గడప వద్దకు చేర్చి తెలంగాణ  దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచిందనిఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం నల్లగొండలో ఎర్రోళ్ల మీడియాతో మాట్లాడారు. గతంలో 10,500 కేసులు పెండింగ్‌లో ఉంటే 8 వేలకు పైగా కేసులను పరిష్కరించి రూ. 55.64 కోట్ల పరిహారాన్ని బాధితులకు అందించామని చెప్పారు. ఇప్పటివరకు 12 వేల గ్రామాల్లో సివిల్‌ రైట్స్‌ దినోత్సవాలను నిర్వహించినట్లు తెలిపారు. 57 కోర్టు కేసులు హియరింగ్‌ చేసి 85 శాతం న్యాయం చేసినట్లు పేర్కొన్నారు.  


logo