హైదరాబాద్ : ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్ మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం ఒక గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయిందని వినోద్ కుమార్ అన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత స్వామినాథన్ దక్కుతుందని వినోద్ కుమార్ తెలిపారు. జీవిత కాలం మొత్తం రైతుల సంక్షేమం గురించి పరితపించిన మహా వ్యక్తి స్వామినాథన్ అని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
వ్యవసాయ రంగంలో అనేక నూతన ఆవిష్కరణలు చేస్తూ అనేక వరి వంగడాలను ప్రపంచానికి అందించిన మహా మేధావి స్వామినాథన్ అని వినోద్ కుమార్ కొనియాడారు. దేశం సహా అనేక అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న వ్యక్తి స్వామినాథన్ అని వినోద్ కుమార్ గుర్తు చేశారు. వారి కుటుంబ సభ్యులకు వినోద్ కుమార్ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలిపారు.