గోదావరి, కావేరీ నదుల అనుసంధానంపై భాగస్వామ్య రాష్ట్రాల అధికారులు నేడు భేటీ అవనున్నారు. జాతీయ జలాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బెంగళూరు వేదికగా ఈ సమావేశం జరుగనుంది. సమ్మక్క ఆనకట్ట నుంచి తొలి విడతగా 141 టీఎంసీలు తరలించాలనేది ప్రతిపాదన.
ఈ నదుల అనుసంధానం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు సాగునీరు.. అలాగే కర్ణాటక, పుదుచ్చేరికి తాగునీరు ఇవ్వాలనేది అధికారుల యోచన. ఈ నేపథ్యంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులతో కేంద్ర జలాభివృద్ధి సంస్థ అధికారులు సమావేశం అవుతారు.