హనుమకొండ చౌరస్తా, మే 10: రాష్ట్ర స్థాయి ఆథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ (జేఎన్ఎస్)లో జరిగాయి. తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి 438 మంది అథ్లెట్లు, 50 మంది టెక్నికల్ అఫీషియల్స్ హాజరయ్యారు. త్రో, జంప్స్‌తో పాటు 400 మీటర్ల పరుగు పందెంలో నిర్వహించిన పోటీల్లో గెలుపే లక్ష్యంగా అథ్లెట్లు పోటీపడ్డారు. ఒలింపిక్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అజీజ్‌ఖాన్, వరంగల్, జనగామ జిల్లాల అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు పుల్యాల కిషన్, పెద్ది వెంకటనారాయణ, క్రీడా పోటీల ఆర్గనైజింగ్ సెక్రటరీ పగడాల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.