నల్లగొండ: మునుగోడులో టీఆర్ఎస్ (TRS) పార్టీకి క్రమంగా మద్దతు పెరుగుతున్నది. ఉపఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థికే తమ మద్దతు ఉంటుందని రాష్ట్ర కుమ్మరి సంఘం ప్రకటించింది. ఈమేరకు కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ రావు ప్రకటించారు. ఆయన నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మునుగోడు నియోజకవర్గం కేంద్రంలో మంత్రి జగదీశ్ రెడ్డితో భేటీ అయింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతే కుల వృత్తులకు పూర్వ వైభవం వచ్చిందని రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ రావు అన్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై కుమ్మరి వృత్తిదారులకు శిక్షణ ఇప్పించడంతో ఉపాధికి గ్యారెంటీ లభించిందని చెప్పారు. అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రమ ఎంతో ఉందని వారు కొనియాడారు.
అటువంటి మహానేత ను గౌరవించాల్సిన బాధ్యత తమ సంఘంపై ఉందన్నారు. ఇందులోభాగంగానే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో ప్రకటించారు.