హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): రైతుల సమస్యలు పరిషరించాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర రైతు సంఘం కోరింది. శుక్రవారం ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డిని హైదరాబాద్లోని సచివాలయంలో రైతు సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్యెల్యే జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్, సహాయ కార్యదర్శి శోభన్, సభ్యులు కలిసి వినతిపత్రం అందజేశారు. రైతుల సమస్యలపై కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పొందుపర్చిన అంశాలకు ప్రాధాన్యమిచ్చి పరిషరించాలని కోరారు.
‘టీ-స్కేర్’కు టెండర్లు బిడ్లకు ఆగస్టు 9దాకా గడువు
హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): రాయదుర్గం, బయోడైవర్సిటీ ప్రాంతాల్లో టీ-స్వేర్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తున్నది. బిడ్లకు ఆగస్టు 9 వరకు గడువు విధించింది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఐఐసీ) ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం ఆర్కిటెక్చరల్, లావాదేవీల సలహాల సేవల కోసం టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ప్రఖ్యాతిగాంచిన టైమ్స్స్కేర్ తరహా టీ-స్కేర్ నిర్మించాలని యోచిస్తున్నది. హైదరాబాద్కు ఐకానిక్గా టీ-స్కేర్ను తీర్చిదిద్దాలని భావిస్తున్నది.
‘కులగణన బిల్లు కోసం ఢిల్లీ యాత్ర’
హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వమే కులగణన చేపట్టాలని, ఈ మేరకు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా బీసీ ఎంపీలంతా కృషి చేయాలని ఓబీసీ యూనియన్ జాతీయ అధ్యక్షుడు పురుషోత్తంగౌడ్ డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కులగణన బిల్లు సాధనకు త్వరలో ఢిల్లీ యాత్ర చేపట్టనున్నట్టు వెల్లడించారు.