హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): కడెం ప్రాజెక్టుకు సంబంధించి రూ.కోటి వ్యయంతో ప్రతిపాదించిన మరమ్మతు పనులకు ఓఅండ్ఎం (ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్) కమిటీ ఆమోదం తెలిపింది. గురువారం ఈఎన్సీ శ్రీనివాస్ నేతృత్వంలో ఓఅండ్ఎం కమిటీ సమావేశం జలసౌధలో జరిగింది.
నాగర్కర్నూల్ మినహా మిగతా అన్ని ఇరిగేషన్ సర్కిళ్ల పరిధిలో ప్రాజెక్టులు, కాలువలు, చెరువుల మరమ్మతులు, పునరుద్ధరణ పనులపై సంబంధిత సీఈలు, అధికారులతో శ్రీనివాస్ చర్చించారు. రూ.కోటి వ్యయంతో కడెం ప్రాజెక్టు గేజ్ రూమ్, తదితర మరమ్మతు పనులకు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.