హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : ప్రజారోగ్యం, పర్యావరణం, జీవవైవిధ్య సంరక్షణను దెబ్బతిసే పారాక్వాట్ గడ్డి మందు అమ్మకాలు, నిల్వలు, వినియోగాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిషేధం 60 రోజులపాటు అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా పారాక్వాట్ మందు అమ్మినా, నిల్వ చేసినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రంలో పారాక్వాట్ గడ్డిమందును నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.