ఎల్బీనగర్: చైతన్యపురి ఏఎస్ఐ ఏసీబీ వలకు చిక్కారు. చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో క్రైం నంబర్ 363 బీఎన్ఎస్ అండర్ సెక్షన్ 78 ప్రకారం సత్యనగర్‌కు చెందిన నేరెళ్ల విక్రం, నిందితుడు పల్లపు రాంబాబుకు మధ్య ఉన్న వివాదంలో లోక్ అదాలత్‌లో కేసును రాజీకుదిరించేందుకు చైతన్యపురి పోలీస్‌స్టేషన్ కోర్టు ఏఎస్ఐ బాలయ్య లంచం డిమాండ్ చేశారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కోర్టులో బాలయ్య లంచం డబ్బులు రూ. 15 వేలు తీసుకుంటూ.. ఏసీబీ అధికారులకు చిక్కారు.
పట్టుబడ్డ ఓయూ ఉద్యోగులు
సికింద్రాబాద్, ఏప్రిల్ 1: ఇద్దరు ఓయూ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. పింఛన్ కోసం ఓ రిటైర్డ్ ఉద్యోగి దరఖాస్తు చేసుకోగా, లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో బాధితుడి నుంచి వర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లోని బిల్స్ సెక్షన్లో పని చేస్తున్న రమేశ్, అరవింద్ రూ. 13వేలు లంచం తీసుకుంటూ..రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.