హైదరాబాద్‌కు మణిహారంలా నిలిచిన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వెంబడి రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన సోలార్ రూఫ్ టాప్ సైక్లింగ్ ట్రాక్‌ను నిర్మిస్తున్నది. 13 మెగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగేలా మొత్తం 23 కిలోమీటర్ల పొడవున నిర్మితమవుతున్న ఈ సైక్లింగ్ ట్రాక్ పనులు ఇప్పటికే తుది దశకు చేరాయి. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సైక్లింగ్ ట్రాక్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ శుక్రవారం వెల్లడించారు.