హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మున్సిపాలిటీల అభివృద్ధికి ఉద్దేశించిన అమృత్ ప్రాజెక్టుల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.573 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు మున్సిపల్ పురపాలకశాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి శనివారం ఉత్తర్వులు జారీచేశారు.
2025-26 బడ్జెట్లో అమృత్ కోసం కేటాయించిన నిధుల్లో భాగంగా ఈ మొత్తం విడుదల చేశారు. ఈ నిధులతో అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ ఫర్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్(అమృత్) పథకంలో తాగునీరు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలను మరింత పటిష్టం చేయనున్నారు.