‘రెసోనెన్స్’ విద్యార్థికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్
తెలంగాణ ఎప్‌సెట్-2026 ఫలితాల్లో రెసోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. ఆదివారం విడుదల చేసిన ఎప్‌సెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో రెసోనెన్స్ విద్యార్థి ఎం రుషి రాష్ట్రస్థాయి మొదటి ర్యాంక్‌ను సాధించి రికార్డు సృష్టించింది.
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 17(నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఎప్‌సెట్-2026 ఫలితాల్లో రెసోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. ఆదివారం విడుదల చేసిన ఎప్‌సెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో రెసోనెన్స్ విద్యార్థి ఎం రుషి రాష్ట్రస్థాయి మొదటి ర్యాంక్‌ను సాధించి రికార్డు సృష్టించింది. అగ్రి, ఫార్మా విభాగంలో ఆటిపాముల భార్గవ్ రాష్ట్రస్థాయిలో 41వ ర్యాంక్ సాధించాడని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నర్రా పూర్ణచంద్రరావు తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో తెలంగాణ రాష్ట్రంలోని టాప్ 10 ఈసీసీఈటీ కళాశాలల్లో మెరిట్ సీట్ల కోసం 1250 మంది విద్యార్థులు అర్హత సాధించారని తెలిపారు. టాప్ 30 ఈసీసీఈటీ కళాశాలల్లో మెరిట్ సీట్ల కోసం 3,250మంది అర్హత సాధించడం గర్వకారణమని వెల్లడించారు. దీంతో పాటు అగ్రి ఫార్మా విభాగాల్లో టాప్ 10 కళాశాల్లో 250 మంది విద్యార్థులు మెరిట్ సీట్లకు అర్హత సాధించారని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

