డాటా సెంటర్‌కు భద్రత ఏదీ.. పాత సర్వర్లతో తరచూ మొరాయిస్తున్న పరికరాలు
రాష్ట్ర సమగ్ర సమాచారం మొత్తం నిక్షిప్తమై ఉండే డాటా సెంటర్‌కు తరచూ సమస్యలు చుట్ట్టుకుంటున్నాయి. తక్కువ సామర్థ్యంతో ఉన్న సర్వర్లు, సాంకేతిక పరికరాలతో స్టేట్ డాటా సెంటర్లో తరచుగా సర్వర్ మొరాయిస్తోంది. ఇటీవలే కాలంలో సర్వర్లు రెండుమూడు సార్లు మొరాయించగా సాంకేతిక సిబ్బంది.
- కీలక శాఖలకు తరచూ అంతరాయం
- ప్రజా సేవలకూ జాప్యమే
- కామన్‌గా మారిన సర్వర్ల ఇష్యూ
- అప్డేషన్పై సర్కార్ నిర్లక్ష్యం
హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర సమగ్ర సమాచారం మొత్తం నిక్షిప్తమై ఉండే డాటా సెంటర్‌కు తరచూ సమస్యలు చుట్ట్టుకుంటున్నాయి. తక్కువ సామర్థ్యంతో ఉన్న సర్వర్లు, సాంకేతిక పరికరాలతో స్టేట్ డాటా సెంటర్లో తరచుగా సర్వర్ మొరాయిస్తోంది. ఇటీవలే కాలంలో సర్వర్లు రెండుమూడు సార్లు మొరాయించగా సాంకేతిక సిబ్బంది. కన్సల్టెంట్లు కలిసి శ్రమించారు. గచ్చిబౌలిలోని స్టేట్ డాటా సెంటర్లో ఏర్పాటు చేసిన సర్వర్ 2002కు ముందస్తుది కావడంతో దీని పనితీరులో సమస్యలు వస్తున్నాయి. గత ప్రభుత్వం సర్వర్లను అప్ గ్రేడ్ చేయాలని యోచించింది. ఇటీవలే కాలంలో సర్వర్లు రెండుమూడు సార్లు మొరాయించగా సాంకేతిక సిబ్బంది. కన్సల్టెంట్లు కలిసి శ్రమించారు. గచ్చిబౌలిలోని స్టేట్ డాటా సెంటర్లో ఏర్పాటు చేసిన సర్వర్ 2002కు ముందస్తుది కావడంతో దీని పనితీరులో సమస్యలు వస్తున్నాయి. గత ప్రభుత్వం సర్వర్లను అప్‌గ్రేడ్ చేయాలని యోచించింది. దీని సామర్థ్యానికి మించి ఒత్తిడి పెరగడంతో తరచుగా సర్వర్ సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్వర్ ఆధునీకరణ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.
డాటా సెంటర్‌పై రాజ్యమేలుతున్న నిర్లక్ష్యం
2011లో ఏర్పాటైన ఈ కేంద్రం అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నది. 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించింది. దీని ప్రాముఖ్యతను గుర్తించిన బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులతోపాటు, సాంకేతికను సమకూర్చుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతోపాటు, కీలకమైన సమాచారం అంతా ఇక్కడే ఉండగా, ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ సెంటర్ ఆధునీకరణ, సామర్థ్యం పెంపుపై ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు, పింఛన్లు, రాష్ట్రంలోని భూముల వివరాలు( భూభారతి) సహా, మీ సేవ తదితర ప్రభుత్వ పోర్టళ్లను, వెబ్ సర్వర్లను ఇక్కడినుంచే నిర్వహిస్తున్నారు. వీటి డాటాకు ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ప్రత్యామ్నాయ సర్వర్లు, డేటా భద్రపరిచే విషయాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.
విపత్తు సంభవిస్తే కోలుకవడం కష్టమే..
కీలకమైన డాటా ఉన్న సర్వర్లు పలు కారణాలతో నిలిచిపోతున్నాయి. ప్రజలకు రకరకాల సేవలందించే మీ సేవలతోపాటు, రిజిస్ట్రేషన్ల సేవలవంటి వాటికి తరచుగా అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగినట్లుగా ఏదైనా విపత్తు సంభవిస్తే ప్రభుత్వ పరిధిలోని ముఖ్యమైన డాటా భద్రత కష్టమేనని, వీటి రికవరీ కూడా సాధ్యం కాకపోవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం స్టేట్ డాటా సెంటర్ అభివృద్ధికి, ఆధునీకరణకు చేసిన సిఫార్సులను అమలు చేస్తే మేలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

