రాష్ట్రానికి 5 గ్రీన్ యాపిల్ అవార్డులు
తెలంగాణకు మరోసారి ప్రపంచస్థాయి గుర్తింపు దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించి, సంరక్షించిన ఐదు ప్రముఖ నిర్మాణాలకు లండన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక గ్రీన్ ఆర్గనైజేషన్ సంస్థ గ్రీన్ యాపిల్ అవార్డులను ప్రకటించింది.
- లండన్‌లో అందుకున్న అర్వింద్
- తెలంగాణకు గర్వకారణం: కేటీఆర్
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు మరోసారి ప్రపంచస్థాయి గుర్తింపు దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించి, సంరక్షించిన ఐదు ప్రముఖ నిర్మాణాలకు లండన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక గ్రీన్ ఆర్గనైజేషన్ సంస్థ గ్రీన్ యాపిల్ అవార్డులను ప్రకటించింది. లండన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ అవార్డులను అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, మొజాంజాహీ మారెట్ పునరుద్ధరణ, డాక్టర్ బీఆర్ అంబేదర్ సచివాలయం, యాదాద్రి దేవాలయం, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లకు ఈ అవార్డులు దక్కాయి. ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్ అవార్డ్స్ ప్రమాణాలతోపాటు పెద్ద ప్రాంతంలో భవనం సానుకూల, ఆకర్షణీయమైన ప్రభావాన్ని గుర్తించి, అవార్డులకు ఎంపిక చేశారు. తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాల ఆధారంగా, ప్రపంచ గుర్తింపు, ప్రాజెక్టులు, విధానాలను అధ్యయనం చేసి ఈ అవార్డులను అందించారని ఆర్వింద్‌కుమార్ తెలిపారు. తెలంగాణ, హైదరాబాద్‌కు గతంలో దక్కిన వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్ (2022), ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ అవార్డ్ (2021), లివింగ్ అండ్ ఇన్‌క్లూజన్ అవార్డ్ – స్మార్ట్ సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్ (2021) అవార్డులతో ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 5 వేర్వేరు విభాగాల్లో 5 అవార్డులను అందుకొన్నామని, అత్యధిక అవార్డులు తెలంగాణకే దక్కాయని వివరించారు.
మంత్రి కేటీఆర్ అభినందనలు
తెలంగాణ ప్రభుత్వం తరపున లండన్‌లో గ్రీన్ యాపిల్ అవార్డు అందుకున్న మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. తెలంగాణకు ఇది గర్వకారణమని మంత్రి అన్నారు. ఈ గుర్తింపు సుస్థిర పట్టణాభివృద్ధి, నిర్మాణ నైపుణ్యం పట్ల తెలంగాణ అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

