HCU Lands | హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): కంచ గచ్చిబౌలి సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల భూమి తమదేనని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆన్లైన్ ద్వారా కోర్టుకు ఈ అఫిడవిట్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జపాన్ పర్యటన నేపథ్యంలో డెడ్‌లైన్‌కు రెండు రోజుల ముందే అఫిడవిట్‌ను అందించినట్టు తెలుస్తున్నది. కంచ గచ్చిబౌలి భూముల్లో ఉన్న వృక్షాలను నరికివేసి, భూమి వేలం వేసేందుకు సరార్ సిద్ధంకాగా హెచ్‌సీయూ విద్యార్థులు, పౌర సమాజం తీవ్రం గా వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
జీవవైవిధ్యం గల ప్రాణులు, వృక్షాలను, ఆవాసాలను ధ్వంసం చేయటంపై తీవ్రంగా ఆగ్రహించిన సర్వోన్నత న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎలాంటి పనులు చేయవద్దని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని కేంద్ర సాధికార కమిటీని నియమించింది. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 16న జరగనుండగా.. సీఎస్ శాంతికుమారి, ఆమె ఆధికారుల బృందం రెండు రోజులు ఢిల్లీలోనే మకాం వేశా రు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపుల జరిపిన అనంతరం సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు.
సెంట్రల్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్టేడియం, ఐఐఐటీ, టిమ్స్, మరికొన్ని సంస్థలు, బస్‌స్టాండులు ఈ భూముల్లోనే ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తెలిపినట్టు సమాచారం. 50 హెక్టార్లలోపు భూ వినియోగం, పర్యావరణ అంశాలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయని పేర్కొన్నట్టు తెలిసింది. పర్యావరణంపై ప్రభావం గురించి అధ్యయనం అవసరం లేదని, వాటిని చదును చేసేప్పుడు పర్యావరణ నిబంధనలు ఎకడా అతిక్రమించలేదని వెల్లడించినట్టు తెలిసింది. భూమి చదును చేసే సమయంలో చట్టాలు, నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని వివరించినట్టు తెలిసింది.
అటవీ, రెవెన్యూ రికార్డుల్లో ఈ భూములను అడవులుగా పేరొనలేదని, సుమారు 20 ఏండ్లకు పైగా 400 ఎకరాల స్థలం న్యాయ వివాదంలో ఉన్నందున, అకడ చెట్లు పెరిగి అడవిలా తయారైందని నివేదించినట్టు సమాచారం. గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి జంతుజాలం ఆవాసం ఏర్పరచుకోలేదని, మార్ఫింగ్, ఏఐ ఆధారిత ఫేక్ ఫొటోలు, వీడియోలతో తప్పుదారి పట్టించారని అఫిడవిట్లో పేరొన్నట్టు తెలిసింది. పర్యావరణ నిబంధనలు పాటిస్తూ, రాక్ ఫార్మేషన్లను కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు సమాచారం. అట్లాగే సెంట్రల్ యూనివర్సిటీ భూమికి క్లియర్ టైటిల్ అందిస్తామని పేర్కొన్నట్టు తెలిసింది.