హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ ‘స్టార్డర్’ దేశంలోనే తొలిసారి హైడ్రోజన్-ఆక్సిజన్ ప్రొపల్షన్ ఇంజిన్‌ను అభివృద్ధి చేసింది. ‘లూకాస్’ అనే ఈ ఇంజిన్‌ను బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో విజయవంతంగా పరీక్షించింది. ఇది నెక్ట్స్ జనరేషన్ ఆర్బిటల్ ట్రాన్స్ఫర్ వెహికిల్‌కి చోదక శక్తినిస్తుందనిస్తుందని చెప్తున్నారు.
ఇస్రో మాజీ శాస్త్రవేత్త రామారావు సారథ్యంలో స్థాపించిన ‘స్టార్డర్’ 2027 నాటికి ‘లూకాస్’ ఇంజిన్‌ను ప్రయోగించాలని భావిస్తున్నది. ఉపగ్రహాలను ఒక కక్ష్య నుంచి మరో కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ఇది సాయపడుతుందని, లోయర్ ఎర్త్ ఆర్బిట్, జియోస్టేషనరీ ఆర్బిట్‌లో స్పేస్‌క్రాఫ్ట్ సులభంగా ప్రయాణించేలా ఈ ఇంజిన్‌ను డిజైన్ చేశామని ‘స్టార్డర్’ డైరెక్టర్ రామారావు తెలిపారు.