హైదరాబాద్, జూన్ 16(నమస్తే తెలంగాణ) : తెలంగాణ బ్రాహ్మణ పరిషత్తు ఆధ్వర్యంలోని శ్రీ రామానుజ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, వేద విద్యార్థులకు ఉద్దేశించిన వేదహిత ఉపకార వేతనాల పథకం నిలిచిపోవడంతో పేద బ్రాహ్మణ విద్యార్థులు తీవ్ర ఇబ్బం ది పడుతున్నట్టు బ్రహ్మణ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. శ్రీరామానుజ ఫీజు రీయింబర్స్మెంట్ స్కీం కింద పోస్ట్మెట్రిక్ విద్యార్థులకు 3.50 లక్షలు, వేదహిత విద్యార్థులకు మరో రూ.3 లక్షల మేర బకాయిపడ్డట్టు పేర్కొన్నాయి. వెంటనే బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశాయి.