మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కే రమేశ్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): 317 జీవో అమలులో భాగంగా బదిలీ అయిన స్టాఫ్ నర్సులను వారి పాత స్థానాలకు వెంటనే రిలీవ్ చేయాలని వైద్యశాలల సూపరింటెండెంట్లను మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కే రమేశ్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 ప్రధాన వైద్యశాలల్లో వైద్యసేవలకు ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు పేర్కొన్నారు. తాత్కాలిక డిప్యూటేషన్‌పై వారిని రిలీవ్ చేసి వారి సొంత వైద్యశాలలకు బదిలీ చేయాలని సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీచేశారు. ఆయా వైద్యశాలల్లో ఖాళీలు భర్తీ అయ్యేవరకు లేదా, తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు వారు అదే స్థానాల్లో కొనసాగుతారని ఉత్తర్వులలో పేర్కొన్నారు.